Ruthuraj Gaikwad: సెన్సేషనల్ రికార్డు సాధించిన రుతురాజ్ గైక్వాడ్

  • టీ20 ఫార్మాట్‌లో వేగంగా 4000 పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచిన ఓపెనర్
  • అంతర్జాతీయ, దేశవాళీ, ఐపీఎల్‌లో పరుగులు కలుపుకొని ఫీట్ సాధించిన యువ ఆటగాడు
  • కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలను అధిగమించిన గైక్వాడ్
Ruthuraj Gaikwad who achieved a sensational record

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా టీ20 ఫార్మాట్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సెన్సేషనల్ రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో వేగంగా 4 వేల పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా అవతరించాడు. రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం రాత్రి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో గైక్వాడ్ కొట్టిన 32 పరుగులతో ఈ రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌తోపాటు ఐపీఎల్‌లో నమోదు చేసిన పరుగులతో కలుపుకొని ఈ ఫీట్‌ని గైక్వాడ్ సాధించాడు. ఈ విషయంలో కేఎల్ రాహుల్, కింగ్ విరాట్ కోహ్లీలను రుతురాజ్ వెనక్కి నెట్టాడు. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాపై నాలుగవ టీ20 మ్యాచ్‌లో ఈ చరిత్రను సృష్టించాడు.

టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రుతురాజ్ గైక్వాడ్ (116 ఇన్నింగ్స్), కేఎల్ రాహుల్ (117 ఇన్నింగ్స్), సురేష్ రైనా (143), రిషబ్ పంత్ ( 147) వరుస స్థానాల్లో ఉన్నారు. ఇక అంతర్జాతీయంగా వేగంగా 4 వేల పరుగులు సాధించిన ఆటగాళ్లను పరిశీలిస్తే క్రిస్ గేల్ (107 ఇన్నింగ్స్), షాన్ మార్ష్(113), బాబర్ ఆజం(115), డెవాన్ కాన్వే (116),  రుతురాజ్ గైక్వాడ్ (116), కేఎల్ రాహుల్ (117) వరుస స్థానాల్లో ఉన్నారు.

కాగా రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాలపై 3వ టీ20లో తొలి టీ20 సెంచరీని నమోదు చేశాడు. దక్షిణాఫ్రికా టూర్‌కు కూడా ఎంపికయ్యాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.

More Telugu News