Prabhas: యాక్షన్ చిత్రాలకు పరాకాష్ఠ... ప్రభాస్ 'సలార్' ట్రైలర్ విడుదల

  • ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో 'సలార్: సీజర్ ఫైర్'
  • రెండు భాగాలుగా వస్తున్న 'సలార్'
  • డిసెంబరు 22న ఫస్ట్ పార్ట్ రిలీజ్ 
Prabhas Salaar trailer out now

ప్రభాస్, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో, తొలిభాగం 'సలార్: సీజ్ ఫైర్' ట్రైలర్ ను నేడు విడుదల చేశారు.

'కేజీఎఫ్' అనుకుంటే, దాన్ని మించి పోయేలా 'సలార్' లో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయన్నది ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. హీరోయిజాన్ని ఎలా పీక్స్ కు తీసుకెళ్లాలో ప్రశాంత్ నీల్ ఇందులో చూపించాడు. ప్రభాస్ ఎంట్రీకి ముందు నడిచిన ఇంట్రోనే అదిరిపోయేలా ఉంది. 

కల్ట్ యాక్షన్ చిత్రాల శ్రేణిలో 'సలార్: సీజ్ ఫైర్' చిత్రం పరాకాష్ఠగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ప్రభాస్ కటౌట్ కు ఎలాంటి సీన్లు ఉంటే సినిమా థియేటర్లు విజిల్స్ తో మార్మోగుతాయో అవన్నీ ఇందులో ఉన్నాయని ట్రైలర్ చెబుతోంది. 

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ కథానాయిక. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, టినూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రియా రెడ్డి, గరుడ రామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందించాడు.

More Telugu News