Bhaskar Reddy: వివేకా హత్య కేసు: భాస్కర్ రెడ్డికి ఈ నెల 20 వరకు రిమాండ్

  • వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డి 
  • భాస్కర్ రెడ్డి... వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి
  • ఇటీవల అనారోగ్యం కారణంగా కండిషనల్ బెయిల్ ఇచ్చిన కోర్టు
  • బెయిల్ గడువు ముగియడంతో కోర్టులో లొంగిపోయిన భాస్కర్ రెడ్డి
CBI Court extends remand for Bhaskar Reddy till Dec 20

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు భాస్కర్ రెడ్డికి రిమాండ్ పొడిగించారు. వివేకా హత్య కేసుకు సంబంధించి ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. భాస్కర్ రెడ్డికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో, సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. భాస్కర్ రెడ్డి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి. అనారోగ్యం కారణంగా భాస్కర్ రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిన్నటితో భాస్కర్ రెడ్డి బెయిల్ ముగిసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టులో లొంగిపోయారు.

More Telugu News