Revanth Reddy: ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంపు!

Security hike at Revanth Reddy residence
  • తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ హవా
  • రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం!
  • రేవంత్ నివాసానికి కాంగ్రెస్ నేతల రాక
  • అధిక సంఖ్యలో పోలీసుల మోహరింపు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే ఎగ్జిట్ పోల్స్ తెరపైకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా అని చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాదులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రత పెంచారు. గతంలో కంటే అధిక సంఖ్యలో పోలీసులను రేవంత్ ఇంటి వద్ద మోహరించారు. 

పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, అంచనాలు అనుకూలంగా ఉండడంతో కాంగ్రెస్ నేతలు రేవంత్ ఇంటికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ సీఎం అభ్యర్థి అనే ప్రచారం కూడా ఉండడంతో, ఆయన నివాసానికి పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా భద్రత పెంచినట్టు తెలుస్తోంది.  
Revanth Reddy
Security
Congress
Telangana

More Telugu News