Chandrababu: శ్రీవారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు

Chadrababu first time with media after arrest
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
  • ప్రజలకు సేవ చేసే శక్తిని ప్రసాదించమని స్వామిని కోరుకున్నానన్న బాబు
  • త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో కలిసి ఈరోజు తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలకు సేవ చేసే శక్తిని తనకు ప్రసాదించమని స్వామిని కోరుకున్నానని చెప్పారు. తనకు కష్టం వచ్చినప్పుడు స్వామిని మొక్కుకున్నానని... ధర్మాన్ని కాపాడాలని ప్రార్థించానని తెలిపారు. త్వరలోనే తన కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.
Chandrababu
Telugudesam
Tirumala

More Telugu News