Shahrukh Khan: ముంబై ఎయిర్ పోర్టులో వెరిఫికేషన్ సందర్భంగా చిరునవ్వులు చిందించిన షారుఖ్ ఖాన్

  • నిన్న ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన షారుఖ్ 
  • ఎంట్రెన్స్ గేట్ వద్ద షారుఖ్ పోలీస్ వెరిఫికేషన్
  • ఎంతో ఓపికగా కనిపించిన షారుఖ్ 
Shah Rukh patiently waits for police verification at Mumbai airport

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ వయసులో కూడా తగ్గేదే లే అంటున్నారు. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లను సాధించి తన సత్తా ఏంటో మరోసారి చూపించారు. తాజాగా ఈ ఏడాదిలో షారుఖ్ చివరి చిత్రం 'డంకీ' ఈ నెలలో విడుదల కాబోతోంది. మరోవైపు, నిన్న షారుఖ్, ఆయన టీమ్ ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు. విమానాశ్రయం ఎంట్రెన్స్ గేట్ వద్ద పోలీసులు షారుఖ్ ఖాన్ పాస్ పోర్టును వెరిఫై చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ సందర్బంగా షారుఖ్ ఎంతో ఓపికగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. పోలీసు అధికారులను చూస్తూ చిరునవ్వులు చిందించారు. అనంతరం ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లిపోయారు.    

More Telugu News