Andhra Pradesh: వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో 20 సాధారణ సెలవులు.. తేదీలు ఇవే

  • సాధారణ లీవ్స్‌తోపాటు 17 ఐచ్చిక సెలవులు
  • జనవరి 15న సంక్రాంతి, 16న కనుమ
  • సెప్టెంబర్ 7న వినాయక చవితి
20 common holidays in Andhra Pradesh next year 2024

ఆంధ్రప్రదేశ్‌లో పండుగలు, జాతీయ సెలవులు కలుపుకొని వచ్చే ఏడాది 2024లో మొత్తం 20 సాధారణ సెలవులు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ సెలవులకు తోడు మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులు ఉంటాయని పేర్కొంది. సాధారణ సెలవుల్లో సంక్రాంతి మొదలుకొని క్రిస్మస్ వరకు పండగల తేదీలను ప్రకటించింది. ఏయే తేదీల్లో సెలవులు వచ్చాయో మీరూ ఓ లుక్కేయండి.

సెలవులు-తేదీలు ఇవే..
1. మకర సంక్రాంతి - జనవరి 15
2. కనుమ -జనవరి  16
3. రిపబ్లిక్ డే - జనవరి  26
4. మహాశివరాత్రి - మార్చి 8
5. హోలి - మార్చి 25
6. గుడ్ ఫ్రైడే - మార్చి 29
7. బాబూ జగ్జీవన్ రావు జయంతి - ఏప్రిల్ 5
8. ఉగాది - ఏప్రిల్ 9
9. ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) - ఏప్రిల్ 11
10. శ్రీరామ నవమి ఏప్రిల్ - 17
11. బక్రీద్ - జూన్ 17
12. మొహర్రం - జులై 17
13. స్వాతంత్ర్య దినోత్సవం - ఆగస్టు 15
14. శ్రీ కృష్ణాష్టమి - ఆగస్టు 26
15. వినాయక చవితి - సెప్టెంబర్ 7
16. మిలాద్ ఉన్ నబీ - సెప్టెంబర్ 16
17. మహాత్మ గాంధీ జయంతి - అక్టోబర్ 2
18. దుర్గాష్టమి - అక్టోబర్ 11
19. దీపావళి - అక్టోబర్ 31
20. క్రిస్మస్ - డిసెంబర్ 25

More Telugu News