5 state election: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ.. బీజేపీ వైపు రాజస్థాన్ మొగ్గు.. ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి

  • రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందంటున్న జన్‌ కీ బాత్
  • మధ్యప్రదేశ్‌లో హోరా హోరీ పోరు తప్పదంటున్న సర్వేలు
  • 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదల
5 state election Exit polls and Madyapradesh and Rajastan expectations

తెలంగాణలో పోలింగ్ ముగియడంతో 5 రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను వివిధ సర్వే సంస్థలు ప్రకటించాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించిన అంచనాలను ప్రకటించాయి. ఆ అంచనాలను పరిశీలిస్తే..

మధ్యప్రదేశ్:                బీజేపీ        కాంగ్రెస్        బీఎస్‌పీ 

జన్‌ కీ బాత్ -                100-123        102-125        0
రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్        118-130        97-107        0
టీవీ9 భారత్ వర్శ్            106-116        111-121        0

రాజస్థాన్:                    బీజేపీ        కాంగ్రెస్        బీఎస్‌పీ

జన్‌ కీ బాత్ -                100-122        62-85        0
రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్        100-110        90-100        0

ఎగ్జిట్ పోల్ అంచనాలను గమనిస్తే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. సర్వే సంస్థలన్నీ బీజేపీకి కాస్త  
మొగ్గు చూపించినప్పటికీ ఇరు పార్టీల మధ్య తీవ్రమైన పోటీకి అవకాశాలున్నాయంటూ సర్వే సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఇక రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒడిదొడులకు ఎదురవడం ఖాయమంటూ ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. అధికారానికి కావాల్సిన మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని లెక్కగట్టాయి.

More Telugu News