తెలంగాణలో ముగిసిన పోలింగ్.. ఈవీఎంలలో అభ్యర్థుల భవిష్యత్తు!
- సాయంత్రం 5 గంటలకు ముగిసిన పోలింగ్
- డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్
- గత ఎన్నికలతో పోలిస్తే తగ్గిన పోలింగ్ శాతం
డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల్లో నిలబడ్డ 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం 3న తేలనుంది. తదుపరి ప్రభుత్వం ఎవరిదో తేలిపోనుంది. ఈ ఎన్నికలు అక్కడక్కడ చిన్నిచిన్న ఘర్షణలు మినహా ప్రశాంతంగా జరిగాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడం నిరాశాజనకమైన విషయంగా చెప్పుకోవచ్చు.