Telangana: పోలింగ్ సందర్భంగా అస్వస్థతకు గురై ఇద్దరి మృతి

Two voters die during polling in Telangana
  • మరో గంటలో ముగియనున్న పోలింగ్ ప్రక్రియ
  • ఆదిలాబాద్ లో పోలింగ్ బూత్ ల వద్ద అస్వస్థతకు గురైన వృద్ధులు 
  • ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు, ఆసుపత్రిలో మరొకరు మృతి 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో గంటలో పోలింగ్ ముగియనుంది. పోలింగ్ ముగియడానికి సమయం దగ్గర పడుతుండటంతో ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు వస్తున్నారు. మరోవైపు పోలింగ్ సందర్భంగా ఆదిలాబాద్ లో విషాదం నెలకొంది. ఓటు వేసేందుకు వచ్చిన ఇద్దరు సీనియర్ సిటిజన్లు రాజన్న (65), గంగమ్మ (78) పోలింగ్ బూత్ వద్ద అస్వస్థతకు గురయ్యారు. వీరిలో గంగమ్మ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. రాజన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

  • Loading...

More Telugu News