SI Recruitment: ఎస్సై నియామక ప్రక్రియపై ఏపీ హైకోర్టు విచారణ

  • రిక్రూట్ మెంట్ పై గతంలో స్టే ఇచ్చిన సింగిల్ జడ్జ్ బెంచ్
  • స్టే ను సవాలు చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేసిన సర్కారు
  • అభ్యర్థుల ఎత్తు కొలతలపై వివాదం.. గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు
AP High Court On SI Recrutement process

ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎస్సై నియామక ప్రక్రియకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ దారు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పిటిషన్ దారులు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. ఎస్సై నియామక ప్రక్రియలో ఎత్తు కొలతలకు సంబంధించి తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నియామక ప్రక్రియపై సింగిల్ బెంచ్ జడ్జి స్టే విధించారు. ఈ స్టేను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసింది.

నియామక ప్రక్రియలో ఎత్తు కొలిచే విధానంపై పలువురు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఆర్ఎస్ఐగా పనిచేసిన అభ్యర్థిని కూడా ఎత్తు సరిపోలేదంటూ పక్కకు తప్పించారని ఆరోపించారు. దీనిపై అభ్యర్థుల తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో అభ్యర్థుల ఎత్తు కొలతలను కోర్టు సమక్షంలో తీసుకోవాలని జడ్జి సూచించారు.

More Telugu News