Telangana Assembly Election: ఆదిలాబాద్‌లో ఓటర్ల కోసం సెల్ఫీ పాయింట్.. బేగంపేటలో బ్యాండ్ మేళంతో స్వాగతం పలికిన విద్యార్థులు

  • నా ఓటు నా గౌరవం అనే కొటేషన్‌తో సెల్ఫీ పాయింట్
  • సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటో దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్న ఓటర్లు
  • రాష్ట్రవ్యాప్తంగా 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్
Selfie point in Adilabad poling booth

తెలంగాణలో పోలింగ్ సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్ జరిగింది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం పదకొండు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ శాతం ఇరవై శాతం దాటినట్లు ఈసీ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఆదిలాబాద్‌లో పోలింగ్ కేంద్రం వద్ద సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. 'నా ఓటు నా గౌరవం', 'నేను నా ఓటును వినియోగించాను మీరు వినియోగించారా?' అంటూ కొటేషన్లతో సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేసింది. పలువురు ఓటర్లు అక్కడ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు.

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ జూనియర్ కాలేజీ విద్యార్థినులు బేగంపేటలోని ఓ పోలింగ్ స్టేషన్ వద్ద బ్యాండ్ మేళంతో ఓటర్లకు స్వాగతం పలికారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి బంజారాహిల్స్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
ఐపీఎస్ అధికారి శిఖాగోయల్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ దంపతులు, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి తదితరులు ఓటు వేశారు.
నటుడు నాగార్జున, అమల, నాగచైతన్యలు జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దర్శకుడు సుకుమార్ దంపతులు, బలగం సినిమా నటి కావ్య కూడా ఓటు వేశారు.
ప్రముఖ టీవీ యాంకర్ సుమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వోటు వేయడం మన బాధ్యత.. సరైన నాయకుడిని ఎంచుకోండి.. అంటూ ట్వీట్ చేశారు.
సినీ నటి పూనమ్ కౌర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

More Telugu News