డ్వాక్రా మహిళలకు డ్రోన్లు... ఉపాధి కోసం సరికొత్త పథకం
- స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందించాలని కేంద్ర నిర్ణయం
- ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
- రైతులకు డ్రోన్లను అద్దెకివ్వడం ద్వారా డ్వాక్రా మహిళలకు ఆదాయం
లబ్దిదారులకు అత్యధికంగా రూ.8 లక్షల సాయం అందించనున్నారు. డ్రోన్లు పొందిన స్వయం సహాయక సంఘాల వారికి డ్రోన్ పైలెట్ శిక్షణ ఇస్తారు. అంతేకాదు, 10 రోజుల పాటు వ్యవసాయ సంబంధ పనులపై శిక్షణ కూడా ఉంటుంది. తద్వారా... రైతులు పురుగు మందుల పిచికారీ, ఎరువుల వాడకం వంటివి డ్రోన్ల ద్వారా చేపట్టే వీలుంటుంది.
డ్రోన్ల సాయంతో వ్యవసాయ పనుల వల్ల ఎంతో సమయం ఆదా అవడమే కాకుండా, మానవ వనరుల కొరతను అధిగమించే వీలుంటుంది. ఈ పథకం ద్వారా మహిళలు గణనీయంగా ఆదాయం పొందే వీలుంటుందని కేంద్రం భావిస్తోంది.