KTR: రక్తదానం చేసిన కేటీఆర్.. దీక్షా దివస్ కు ఈసీ అభ్యంతరం

  • తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించిన బీఆర్ఎస్
  • కార్యక్రమాన్ని నిర్వహించొద్దన్న ఈసీ అధికారులు
  • రక్తదాన శిబిరం నిర్వహణకు అనుమతి
KTR blood donation

తెలంగాణ భవన్ లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే, ఈ కార్యక్రమానికి ఈసీ స్క్వాడ్ అభ్యంతరం తెలిపింది. ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో పార్టీ కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించొద్దని అధికారులు చెప్పారు. అయితే, దీక్షా దివస్ అనేది ఎన్నికల కార్యక్రమం కాదని బీఆర్ఎస్ నేతలు వారికి తెలిపారు. అయినప్పటికీ కార్యక్రమాన్ని ఆపేయాలని అధికారులు చెప్పారు. అయితే రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడానికి మాత్రం అనుమతించారు. ఇదే సమయంలో తెలంగాణ భవన్ కు కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ తో పాటు, పలువురు నేతలు రక్తదానం చేశారు.

More Telugu News