Chandrababu: ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌.. నేడు హైకోర్టులో విచారణ

  • అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిలు పిటిషన్‌పైనా విచారణ
  • స్కిల్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులోనూ ఊరట
  • బహిరంగ సమావేశాల్లో పాల్గొనవచ్చన్న సుప్రీం ధర్మాసనం
IRR case against Chandrababu AP High Court hears today

ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను ఏపీ హైకోర్టు నేడు విచారించనుంది. అలాగే, అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణ, ఇతరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపైనా నేడు విచారణ జరగనుంది.


మరోవైపు, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించింది. బాబుకు బెయిలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసినా చుక్కెదురైంది. బెయిలు రద్దు పిటిషన్‌ను డిసెంబరు 8కి వాయిదా వేసిన ధర్మాసనం.. హైకోర్టు షరతుల్లో కొన్నింటిని మార్పు చేసింది. చంద్రబాబు బహిరంగ సమావేశాలకు హాజరు కావొచ్చిన స్పష్టం చేసింది. అయితే, కేసు గురించి మాత్రం ఎక్కడా మాట్లాడవద్దని ఆదేశించింది.

More Telugu News