సచిన్ అనే పేరుతో రైల్వే స్టేషన్... తన ఫొటో ద్వారా పరిచయం చేసిన గవాస్కర్
- గుజరాత్ లోని సూరత్ కు సమీపంలో సచిన్ అనే గ్రామం
- రైల్వే స్టేషన్ లో ఫొటో దిగిన గవాస్కర్
- ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు
సచిన్ తన అభిమాన క్రికెటర్ అని, సచిన్ అనే పేరుతో ఓ రైల్వే స్టేషన్ ఉండడం తనకు సంతోషాన్నిచ్చిందని గవాస్కర్ వెల్లడించాడు. అంతేకాదు, గత శతాబ్దంలోని వారికి ఎంతో ముందు చూపు ఉందని, సచిన్ ఘనతలను అప్పుడే ఊహించి స్టేషన్ కు పేరుపెట్టేశారని చమత్కరించాడు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. గవాస్కర్ పోస్టుకు విపరీతమైన స్పందన వస్తోంది.