బీఆర్ఎస్ కండువా వేసుకోకుంటే తెలంగాణ గడ్డమీద బతకనివ్వమని బెదిరించే పరిస్థితి ఉంది: ఈటల విమర్శలు
- దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదన్న ఈటల
- పేదల వద్ద ఉన్న భూములు లాక్కున్నారని ఆరోపణ
- కేసీఆర్ పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారని విమర్శలు
కొండపాక కలెక్టర్ కార్యాలయం కోసం 250 ఎకరాల భూమి అవసరమైతే 350 ఎకరాలు తీసుకున్నారని, మిగిలిన భూమిని ప్లాట్లు చేసుకొని అమ్ముకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములు పేదలకు ఉండకూడదనే కేసీఆర్ అలా చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకోవడం దారుణమన్నారు.