Pat Cummins: కోహ్లీ వికెట్ తీశాక "ఒక్కసారి స్టేడియంను చూడండి" అని స్మిత్ అన్నాడు: పాట్ కమిన్స్

  • ప్రపంచ కప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా
  • ఫైనల్లో టీమిండియాపై విజయం
  • కోహ్లీని బౌల్డ్ చేసిన కమిన్స్
  • 70 ఏళ్లు దాటాక కూడా కోహ్లీ వికెట్ ను గుర్తుచేసుకుంటానన్న కమిన్స్
Pat Cummins said he will remember Kohli wicket in old age

పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇప్పుడు ప్రపంచ విజేత. భారత గడ్డపై జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఆసీస్ జట్టు ఫైనల్లో టీమిండియాను ఓడించి చాంపియన్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆసీస్ సారథి కమిన్స్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఫైనల్లో కోహ్లీ వికెట్ పడగొట్టడం తనకు అత్యంత మధుర స్మృతి అని తెలిపాడు. 70 ఏళ్లు దాటాక, జీవితం చరమాంకంలో ఉన్నప్పుడు సైతం కోహ్లీ వికెట్ ను గుర్తు చేసుకుంటానని అన్నాడు. అంతటి కీలక వికెట్ తీయడం తన జీవితంలోనే అద్భుత క్షణం అని అభివర్ణించాడు. 

కాగా, కోహ్లీ వికెట్ పడ్డాక ఆటగాళ్లం అందరం ఒక్కచోట చేరామని, అప్పుడు స్టీవ్ స్మిత్ ఒక్కసారి స్టేడియంను చూడండి అన్నాడని కమిన్స్ వెల్లడించాడు. అప్పుడు స్టేడియంను చూస్తే అంతా నిశ్శబ్దంగా మారిపోయిందని, ఆ రోజు మ్యాచ్ కు లక్ష మంది భారత అభిమానులు వచ్చారని, కోహ్లీ అవుటవడంతో వారందరూ మౌనంగా ఉండిపోయారని కమిన్స్ వివరించాడు. ఓ లైబ్రరీ ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో, ఆ క్షణంలో స్టేడియం అలా మారిపోయిందని పేర్కొన్నాడు. ఆ క్షణాలను తాను చాలాకాలం పాటు ఆస్వాదిస్తానని తెలిపాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో కోహ్లీ 54 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ లోనే బౌల్డయ్యాడు.

More Telugu News