Rain: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నాలుగు రోజుల పాటు వర్ష సూచన

  • బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్న వాతావరణ శాఖ
  • 48 గంటల్లో తుపానుగా బలపడుతుందని హెచ్చరిక
  • తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి
Rain forecast for Telangana

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఉన్న మలక్కా జలసంధి ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని... ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని వెల్లడించింది. రేపు (బుధవారం) వాయుగుండంగా మారుతుందని చెప్పింది. రానున్న 48 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ తుపానుగా బలపడుతుందని తెలిపింది. తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈరోజు గాలి 25 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని పేర్కొంది. డిసెంబర్ 1న గాలి వేగం 60 నుంచి 80 కిలోమీటర్లుగా ఉంటుందని వెల్లడించింది. 

More Telugu News