Vijayasai Reddy: నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబు: విజయసాయిరెడ్డి

టీడీపీ యువనేత నారా లోకేశ్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. ఎవరు నడవమన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర అని ఆయన ఎద్దేవా చేశారు. లోకేశ్ గారికి నడక భారమై బిత్తర సవాళ్లు విసురుతున్నారని అన్నారు. గాలికుంటు, బ్లూ టంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబు అని సూచించారు. ఛాలెంజ్ చేయడానికి కూడా ఒక స్థాయి ఉండాలని విమర్శించారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Vijayasai Reddy
YSRCP
Nara Lokesh
Telugudesam

More Telugu News