Postal Ballet: మధ్యప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ ట్యాంపరింగ్.. వీడియో ఇదిగో!

  • స్ట్రాంగ్ రూమ్ నుంచి పోస్టల్ బ్యాలెట్ లను బయటకు తీసిన వైనం
  • ఓట్లను లెక్కిస్తూ కెమెరాలకు చిక్కిన బాలాఘాట్ అధికారులు
  • ఈ నెల 17న మధ్యప్రదేశ్ లో పూర్తయిన పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్
Congress Complained To Ec About Balaghat Dm Manipulation Of Postal Votes Mp Election Result

మధ్యప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ ట్యాంపరింగ్ కు గురైందంటూ ఓ వీడియో వైరల్ గా మారింది. స్ట్రాంగ్ రూమ్ లో ఉండాల్సిన పోస్టల్ బ్యాలెట్ ను కొంతమంది బయటకు తీసి, అందులోని ఓట్లు లెక్కిస్తుండడం ఈ వీడియోలో కనిపిస్తోంది. రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 17న పోలింగ్ పూర్తయింది. పోలింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బంది, వృద్ధులు, సైనికులు.. ఇలా పలువురు తమ ఓటుహక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు.

ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నారు. అప్పటి వరకు ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్లు అన్నీ స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. బాలాఘాట్ జిల్లాలో మాత్రం పోస్టల్ బ్యాలెట్ ను ముందే ఓపెన్ చేశారు. కొంతమంది అధికారులు పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తుండగా మీడియా ప్రతినిధులు వెళ్లి వారిని ప్రశ్నించారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ ను యథావిధిగా ప్యాక్ చేయడం కనిపించింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ సీఎం కమల్ నాథ్ కూడా దీనిని షేర్ చేశారు. ఈ ఘటనలో కలెక్టర్ గిరీశ్ కుమార్ మిశ్రా పాత్ర కూడా ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ తో పాటు బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News