Raghu Rama Krishna Raju: ఢిల్లీలో చంద్రబాబును కలిసిన రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju met Chandrababu in Delhi
  • ఢిల్లీలో న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తనయుడి పెళ్లి రిసెప్షన్
  • ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు
  • చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానన్న రఘురామ
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తనయుడి పెళ్లి రిసెప్షన్ కు హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ ఢిల్లీలో చంద్రబాబును కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోను రఘురామ ఎక్స్ లో పోస్టు చేశారు. ఢిల్లీలో చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిశానని ఆయన వెల్లడించారు. ఆ ఫొటోలో చంద్రబాబు... రఘురామ భుజంపై చేయి వేసి చిరునవ్వుతో కనిపించారు. 

కాగా, ఢిల్లీ ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో రఘురామ కూడా ఉన్నారు! దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
Raghu Rama Krishna Raju
Chandrababu
New Delhi
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News