BRS: శేరిలింగంపల్లిలో ఎన్నికల విచిత్రం... బీఆర్ఎస్ అభ్యర్థికి స్థానిక తెలంగాణ టీడీపీ డివిజన్ల అధ్యక్షుల మద్దతు

TTDP is supporting brs candidate in Sherilingampally
  • బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు టీటీడీపీ డీవిజన్ల అధ్యక్షుల ప్రకటన
  • అభివృద్ధితో పాటు స్థానిక పరిస్థితులను బట్టి మద్దతిచ్చినట్లు వెల్లడి
  • అరికెపూడి గాంధీకి మద్దతిస్తున్నట్లు ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పరోక్షంగా మద్దతిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీకి ఆ పార్టీ అండగా ఉంటోంది. బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు స్థానిక తెలంగాణ టీడీపీ డివిజన్ల అధ్యక్షులు ప్రకటించారు. మద్దతు ఇవ్వడానికి గల కారణాలను వారు వెల్లడించారు. అభివృద్ధితో పాటు స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ మాత్రం తాము అరికెపూడి గాంధీకి మద్దతిస్తున్నామని, ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ మేరకు కొండాపూర్, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, హఫీజ్ పేట, ఆల్విన్ కాలనీ డివిజన్ల అధ్యక్షులు ప్రకటించారు. ఇక్కడ ఉన్న నాయకుల్లో అందరినీ సమానంగా చూసే నాయకుడు అరికెపూడి గాంధీ అని, అందుకే తాము సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు వారు తెలిపారు.
BRS
Telangana Assembly Election
Telugudesam

More Telugu News