Radhika Song: టిల్లు స్క్వేర్ నుంచి 'రాధిక' సాంగ్ విడుదల... ఇంట్రోలో సిద్ధు డైలాగ్స్ అదుర్స్

Radhika lyrical song from Tillu Square out now
షార్ట్స్‌లో చూడండి
యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం 'టిల్లు స్క్వేర్'. సెన్సేషనల్ హిట్టయిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా 'రాధిక' అనే సాంగ్ లిరికల్ వీడియో విడుదలైంది. "రాధిక... రాధిక... నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే... నీ బొంగులో మాటలు విని పడిపోయానే" అంటూ సాగే ఈ గీతానికి రామ్ మిరియాల సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చారు. ఈ గీతాన్ని రామ్ మిరియాల స్వయంగా ఆలపించారు. 

'డీజే టిల్లు' చిత్రంలో రాధిక పాత్ర ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాత్ర స్ఫూర్తితోనే ఈ పాటను రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ గీతానికి ముందు వచ్చే ఇంట్రోలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ మధ్య సంభాషణ ఆడియన్స్ ను రక్తికట్టిస్తుంది. 

సితార ఎంటర్టయిన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న 'టిల్లు స్క్వేర్' చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడు. 'డీజే టిల్లు' తరహాలోనే ఈ చిత్రంలోనూ ఎంటర్టయిన్ మెంట్ పక్కా అని తెలుస్తోంది.

'టిల్లు స్క్వేర్' నుంచి వచ్చిన అప్ డేట్స్ కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ వినోద్మాక చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Go Back to Shorts
Radhika Song
Tillu Square
Sddhu Jonnalagadda
Anupama Parameswaran
Mallik Ram

More Telugu News