IMD: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

  • అండమాన్ సముద్రం, మలక్కా జలసంధిని ఆనుకుని అల్పపీడనం
  • ఈ నెల 29 నాటికి వాయుగుండం
  • డిసెంబరు 1 కల్లా తుపానుగా బలపడే అవకాశం
IMD announces low pressure formed in Bay Of Bengal

అండమాన్ సముద్రం, మలక్కా జలసంధిని ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని, ఈ నెల 29 నాటికి వాయుగుండంగా బలపడనుందని తెలిపింది. అక్కడ్నించి వాయవ్య దిశగా పయనించి 48 గంటల్లో తుపానుగా మారుతుందని ఐఎండీ వివరించింది. దీని ప్రభావం డిసెంబరు 1 నుంచి భారత తీర ప్రాంతంపై కనిపిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి అల్పపీడన ప్రభావం అండమాన్ దీవులపై అధికంగా ఉండనుంది.

More Telugu News