వెలుగు చూపించని రహస్యాలను చీకటి బయటపెడుతుంది: 'కాంతార - చాప్టర్ 1' టీజర్ రిలీజ్!
- సంచలన విజయాన్ని సాధించిన 'కాంతార'
- ఆ సినిమాకి ప్రీక్వెల్ గా 'కాంతార - చాప్టర్ 1'
- ఉత్కంఠను పెంచుతున్న టీజర్
- ఏడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు లుక్ టీజర్ ను రిలీజ్ చేశారు. వెలుగు చూపించనిలేని ఎన్నో రహస్యాలను చీకటి బయటపెడుతోంది. వాటిని చూసి తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలనేది ఆసక్తిని రేకెత్తించే డైలాగ్. అడవి నేపథ్యంలో పౌర్ణమి చంద్రుడు .. ప్రళయకాల రుద్రుడిలా కథానాయకుడు కనిపిస్తున్నాడు.
'కాంతార'లో కథ ఆరంభంలో ఒక రాజు అడవిలోని గిరిజన ప్రజలకు భూమిని దానంగా ఇస్తాడు. అంతకు ముందు నుంచి ఈ కథ మొదలవుతుంది. ఈ సినిమా కోసం 200 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టు తెలుస్తోంది. ఏడు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అజనీశ్ లోక్ నాథ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.