కేసీఆర్ ను వేటాడేందుకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నా: రేవంత్ రెడ్డి
- కామారెడ్డి ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోతుందన్న టీపీసీసీ చీఫ్
- అమ్మగారి ఊరు కేసీఆర్ కు 40 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందంటూ ఎద్దేవా
- కామారెడ్డి భూములను మింగేందుకే ఇక్కడికి వచ్చిండని ఆరోపణ
పేదల రక్తం రుచి మరిగిన కేసీఆర్ ను వేటాడేందుకే తాను కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో బొందపెట్టాలని కామారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు.