Delhi: ఘర్షణలో తీవ్ర ఆగ్రహంతో భర్త చెవి కొరికేసిన భార్య

wife bit off her husbands ear in anger in Delhi
  • ఇల్లు శుభ్రం చేసే విషయంలో దంపతుల మధ్య గొడవ
  • మాటామాట పెరగడంతో భర్తపై దాడికి పాల్పడ్డ భార్య
  • భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత భర్త, కేసు నమోదు
ఓ మహిళ తీవ్ర ఆగ్రహంతో తన భర్త కుడి చెవిని కొరికింది. అనూహ్య పరిణామంతో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు భార్యపై కేసు పెట్టాడు. ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన వెలుగుచూసింది. భార్య కారణంగా తన కుడి చెవి పైభాగం ఛిద్రమైందని, శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నవంబర్ 20న ఉదయం 9.20 గంటల సమయంలో ఇంట్లోని చెత్త పడేయడానికి బయటకు వెళ్లానని, తిరిగి వచ్చేసరికి ఇల్లు శుభ్రం చేయాలని చెప్పినా ఆమె పట్టించుకోలేదని చెప్పాడు. పైగా అకారణంగా తనతో గొడవ పడిందని, ఇల్లు అమ్మి సగం వాటా ఇస్తే పిల్లలతో వేరు కాపురం పెడతానని డిమాండ్ చేసిందని ఫిర్యాదులో బాధితుడు వాపోయాడు.

ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదని, ఇద్దరి మధ్య ఘర్షణ ముదురుతుండడంతో ఆమెను పక్కకు నెట్టి బయటకు వెళ్తుండగా వెనుక నుంచి పట్టుకొని కుడి చెవిని బలంగా కొరికిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. చికిత్స కోసం తన కొడుకు తనను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడని, శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని వివరించాడు. కాగా ఈ ఘటనపై నవంబర్ 20న ఆసుపత్రి నుంచి తమకు సమాచారం అందిందని, దర్యాప్తు మొదలుపెట్టామని పోలీసులు వెల్లడించారు. చికిత్స అనంతరం నవంబర్ 22న భర్త వచ్చి తమకు ఫిర్యాదు చేశాడని, ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వివరించారు.
Delhi
Crime News
wife bits husbands ear

More Telugu News