రెండో టీ20: టాస్ గెలిచిన ఆసీస్... టీమిండియాకు బ్యాటింగ్

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదిక. టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ గెలిచిన టీమిండియా... నేడు రెండో మ్యాచ్ కు కూడా అదే జట్టుతో బరిలో దిగింది. అటు, ఆసీస్ జట్టులో రెండు మార్పులు చేశారు. పేసర్ బెహ్రెండార్ఫ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా... ఆరోన్ హార్డీ స్థానంలో గ్లెన్ మ్యాక్స్ వెల్ జట్టులోకి వచ్చారు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ప్రస్తుతం 1 ఓవర్ ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 5, యశస్వి జైస్వాల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Team India
Australia
Toss
2nd T20
Tiruvanantapuram

More Telugu News