యూపీలో అదానీ గ్రూపునకు చెందిన గోదాంలో భారీ అగ్నిప్రమాదం

  • సహరన్ పూర్ లో ఘటన
  • గత అర్ధరాత్రి అగ్నిప్రమాదం
  • బాంబుల్లా పేలిన నూనె, నెయ్యి డబ్బాలు
  • భయాందోళనలకు గురైన స్థానికులు
ఉత్తరప్రదేశ్ లో అదానీ గ్రూపునకు చెందిన ఓ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సహరన్ పూర్ లోని ఈ గోదాంలో ఫార్చూన్, ఇతర బ్రాండ్ల వంట నూనె, నెయ్యి డబ్బాలు, పంచదార, పిండి, ఇతర నిత్యావసర సరుకులు భారీ స్థాయిలో నిల్వ ఉంచుతారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తారు. 

అగ్నిప్రమాదం కారణంగా నెయ్యి, నూనె డబ్బాలు పెద్ద శబ్దంతో విస్ఫోటనం చెందడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గత అర్ధరాత్రి నుంచి మొదలైన మంటలు క్రమంగా గోదాం మొత్తానికి వ్యాపించాయి. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ 12 ఫైరింజన్లను రంగంలోకి దింపింది. పొరుగు జిల్లాల నుంచి కూడా ఫైరింజన్లను, అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. మంటల కారణంగా తీవ్రస్థాయిలో పొగ రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ గోదాంలో తీవ్రస్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.

Fire Accident
Godown
Adani Group
Saharanpur
Uttar Pradesh

More Telugu News