barrelakka shirisha: పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్క కర్నె శిరీష బెటర్: రామ్ గోపాల్ వర్మ

Never seen a more disinterested and more careless campaign more than
  • తాండూరులో పవన్ కల్యాణ్ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ
  • ఇంత దారుణమైన, అనాసక్తి, అజాగ్రత్త ప్రచారాన్ని ఇంతకుముందెప్పుడూ చూడలేదని విమర్శలు
  • సభ నిర్వాహకులు కూడా మైక్ సౌండ్ గురించి పట్టించుకోలేదన్న వర్మ
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీతో పొత్తుతో ముందుకు సాగుతున్న పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ రోజు తాండూరులో బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియోను రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ అకౌంట్ వేదికగా షేర్ చేస్తూ... ఇంత దారుణమైన ప్రసంగాన్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.

ఇంతకంటే దారుణమైన, ఏమాత్రం ఆసక్తిలేని, అజాగ్రత్త ప్రచారాన్ని తాను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్... తాను మాట్లాడుతున్నప్పుడు కనీసం మైక్ సౌండ్ గురించి కూడా పట్టించుకోలేదని.. కనీసం సభ నిర్వాహకులు కూడా దానిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. జనసేనానితో పోలిస్తే ప్రచారంలో బర్రెలక్క కర్నె శిరీష మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు.
barrelakka shirisha
Pawan Kalyan
RGV
Telangana Assembly Election

More Telugu News