యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోదీ
- బెంగళూరులో హెచ్ఏఎల్ ను సందర్శించిన మోదీ
- ట్విన్ సీటర్ తేజస్ లో ప్రయాణించిన ప్రధాని
- మన స్వదేశీ సామర్థ్యంపై నమ్మకం మరింత పెరిగిందని వ్యాఖ్య
ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ... తేజస్ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించానని చెప్పారు. ఇదొక గొప్ప అనుభవమని అన్నారు. మన స్వదేశీ సామర్థ్యంపై తన నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు. మన శక్తి సామర్థ్యాల పట్ల గర్వంగా ఉందని, ప్రపంచంలో మనం ఎవరికీ తక్కువ కాదనే విషయాన్ని గర్వంగా చెప్పగలనని తెలిపారు.