Sampuranesh Babu: సంపూర్ణేశ్‌ బాబు నా సోదరుడి లాంటివాడు: మంచు మనోజ్‌

Sampuranesh Babu is like my brother says Manchu Manoj
  • సంపూని చూస్తుంటే మా ప్రసాద్ అన్న గుర్తొస్తున్నాడని వ్యాఖ్య
  • సంపూ ఎంత మంచివాడో అతడి నవ్వే చెబుతోందన్న మనోజ్
  • ‘సోదరా’ సినిమాలోని పాట విడుదల ఈవెంట్‌లో ముఖ్యఅతిథిగా మాట్లాడిన మనోజ్

అన్నదమ్ముల మధ్య ఎలాంటి ఇగోలు ఉండకూడదని, సమస్య తలెత్తినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాలని అప్పుడే బంధం బావుంటుందని మంచు మనోజ్ అన్నాడు. అన్నదమ్ముల మధ్య సమస్యలు ఉన్నాయంటే వారు కూర్చొని మాట్లాడుకోవట్లేదని అర్థమని అభిప్రాయపడ్డాడు. సంపూర్ణేశ్‌ బాబు హీరోగా నటించిన ‘సోదరా’ మూవీలో ఒక పాట విడుదల కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. సంపూర్ణేశ్ బాబును చూస్తుంటే ప్రసాద్ అన్న గుర్తొస్తున్నాడంటూ తన బాబాయి కొడుకుని (ప్రమాదంలో కన్నుమూశారు) మనోజ్ గుర్తుచేసుకున్నాడు. సంపూర్ణేశ్ ఎంత మంచివాడో అతడి నవ్వే చెబుతుందని అన్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ సినిమాలకు సంపూర్ణేశ్ బాగా కనెక్ట్‌ అవుతాడని, ఈ ఈవెంట్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని మనోజ్ అన్నాడు.

అన్నదమ్ముల మధ్య భావోద్వేగాలపై సినిమా తీయడం సంతోషంగా ఉందని మనోజ్ అన్నాడు. ‘సోదరా’ సినిమా గ్రాండ్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. కాగా ‘సోదరా’ సినిమాలో సంపూర్ణేశ్‌బాబు, సంజోష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మన్మోహన్‌ మేనంపల్లి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను సినిమా యూనిట్ మొదలుపెట్టింది. ఇదిలావుండగా మంచు మనోజ్ ప్రస్తుతం ‘వాట్‌ ది ఫిష్‌’ సినిమాలో నటిస్తున్నాడు. వరుణ్‌ కోరుకొండ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News