Visakha Fishing Harbour: విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటన దర్యాప్తు ముమ్మరం.. సీసీటీవీలో రికార్డయిన ఆ ఇద్దరి గురించి వేట!

Visakha Fishing Harbour Incident Police Seize CCTV Footage
  • ఫిషింగ్ హార్బర్ సమీపంలోని పెట్రోలు బంక్ నుంచి సీసీటీవీ ఫుటేజీని సేకరించిన పోలీసులు
  • ప్రమాదానికి కొద్దిసేపటి ముందు బోటు నుంచి బయటకు వచ్చిన ఇద్దరు
  • వారిని ప్రశ్నిస్తే మిస్టరీ వీడే అవకాశం
విశాఖపట్టణం ఫిషింగ్ హార్బర్‌ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. దర్యాప్తులో భాగంగా ఫిషింగ్ హార్బర్ సమీపంలోని పెట్రోలు బంక్ సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు ప్రమాదం జరిగిన బోటు నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు రావడం అందులో రికార్డయింది. దీంతో ఈ ఘటనకు, వారికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ఇద్దరిని గర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ప్రమాదం జరిగిన 19వ తేదీ రాత్రి 10.48 గంటలకు బోటు నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు రాగా రాత్రి 10.50 గంటలకు బోటులో మంటలు చెలరేగాయి. దీంతో వీరిపై అనుమానాలు బలపడడంతో వారిద్దరిని గుర్తించి వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే యూట్యూబర్ నాని సహా మరికొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
Visakha Fishing Harbour
CCTV
Crime News
Visakhapatnam
Fire Accident

More Telugu News