DurgaRao: 'ఇదే సీఎం సీటు' అంటూ కూర్చున్న టిక్ టాక్ స్టార్ దుర్గారావు.. అది సీఎం ఆఫీసు కాదన్న ఏపీ పోలీసులు.. వీడియో ఇదిగో !

  • క్యాంపు కార్యాలయం అంటూ వీడియో పెట్టిన వైనం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • ఇప్పటి వరకు చర్యలు తీసుకోని పోలీసులు
Youtuber DurgaRao In AP CM Chair

ప్రభుత్వ ఆఫీసులలో అధికారుల ముందు అనుమతి లేకుండా కూర్చోవడం కూడా నేరం కిందికే వస్తుంది.. ఇక వీడియోలు తీయడం, రీల్స్ చేయడం వంటి వాటికి పాల్పడితే అటునుంచి అటు జైలుకే వెళ్లాల్సి వస్తుంది. అలాంటిది ఓ యూట్యూబర్ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నానంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అయితే, అది సీఎం ఆఫీసు కాదని వివరణ ఇచ్చిన పోలీసులు.. సదరు యూట్యూబర్ పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన దుర్గారావు టిక్ టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యాడు. టిక్ టాక్ బ్యాన్ అయ్యాక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి వీడియోలు చేస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన ఓ వీడియో వివాదాస్పదంగా మారింది. కొంతమంది మహిళలతో కలిసి సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లానంటూ దుర్గారావు ఈ వీడియోలో చెప్పాడు. సీఎం క్యాంపు ఆఫీసు ఇదేనని, పోలీసుల పర్మిషన్ తో లోపలికి వచ్చామని వీడియోలో చెప్పుకొచ్చారు. ఆపై సీఎం సీటు అంటూ ఓ కుర్చీని చూపించిన దుర్గారావు అందులో దర్జాగా కూర్చున్నాడు.

కుర్చీ వెనక బ్యాక్ గ్రౌండ్, సీఎం జగన్ ఫొటో అచ్చంగా ఒరిజినల్ గా కనిపించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఇది నిజంగా సీఎం క్యాంపు కార్యాలయంలో తీసిన వీడియో కాదని పోలీసులు వివరణ ఇచ్చారు. వీడియో ద్వారా తప్పుడు ప్రచారం చేసిన దుర్గారావుపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


More Telugu News