Karnataka: బాలికకు స్కూల్లో బలవంతంగా కోడిగుడ్లు తినిపించిన టీచర్‌.. విద్యాశాఖకు తండ్రి ఫిర్యాదు!

  • కర్ణాటకలోని శివమొగ్గలోగల ప్రభుత్వ పాఠశాలలో ఘటన
  • తాము శాకాహారులమని చెప్పినా ఉపాధ్యాయులు పట్టించుకోలేదన్న బాలిక తండ్రి
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ 
  • తండ్రి ఆరోపణల్ని కొట్టిపారేసిన స్కూల్ ఉపాధ్యాయులు
Father lodges complaint after his daughter forcefully fed eggs in school in Shivamogga Karnataka

ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న తన కూతురికి ఓ టీచర్ బలవంతంగా కోడిగుడ్లు తినిపించారంటూ బాలిక తండ్రి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.  కోడిగుడ్లు తిన్నాక తన కూతురు అస్వస్థతకు గురైందని తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

తన కూతురు వద్దంటున్నా మధ్యాహ్న భోజన పథకం కింద గుడ్లు తినిపించారని తండ్రి పేర్కొన్నారు. తాము శాకాహారులమని స్కూల్ యాజమాన్యానికి ముందే చెప్పినా టీచర్ పట్టించుకోలేదన్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే కొడతానని తన కూతురిని బెదిరించినట్టు వెల్లడించారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారు గుడ్డు తింటే ఏమీ కాదని కూడా టీచర్ అన్నట్టు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన టీచర్, ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

కాగా, బాలిక తండ్రి ఆరోపణల్ని స్కూల్ ఉపాధ్యాయులు కొట్టిపారేశారు. పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి మాత్రమే ప్రేరేపించామని  తెలిపారు.

More Telugu News