Sachin Tendulkar: ఆస్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ ఉత్కంఠభరితమే: సచిన్

Playing Australia has always been exciting says Sachin
  • ఆస్ట్రేలియాతో ఎన్నో క్లిష్టమైన మ్యాచ్ లు ఆడామన్న సచిన్
  • కొందరు ప్లేయర్లతో జీవితకాల అనుబంధాన్ని పెంచుకున్నామని వ్యాఖ్య
  • ఈరోజు యంగ్ క్రికెట్ టీమ్ ఫీల్డ్ లో అడుగుపెడుతోందన్న సచిన్

వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటుందని చెప్పారు. ఆస్ట్రేలియాతో క్లిష్టమైన మ్యాచ్ లు ఎన్నో ఆడామని... ఇదే సమయంలో కొందరు అద్భుతమైన ఆసీస్ ప్లేయర్లతో జీవితకాల అనుబంధాన్ని ఏర్పరుచుకున్నామని అన్నారు. ఈరోజు ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్ ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ... యంగ్ ఇండియన్ టీమ్ ఈరోజు ఫీల్డ్ లో అడుగుపెడుతోందని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు జియో సినిమాలో జనరేషన్ నెక్స్ట్ లో తన కార్యక్రమాన్ని చూడాలని సూచించారు.
Sachin Tendulkar
Team India
Australia
T20

More Telugu News