ఈ 27 నుంచి డిసెంబర్ 3 మధ్య విజయవాడ డివిజన్‌లో 3 రైళ్ల రద్దు
- డివిజన్‌లో భద్రతా పనులు కొనసాగుతుండడంతో నిర్ణయం
- రైళ్ల వివరాలు ప్రకటించిన రైల్వే అధికారులు
- పనుల కారణంగా ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన అధికారులు
కాగా డివిజన్‌లో పనుల కారణంగా ఇప్పటికే పలు రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు ఇప్పటికే 28 నుంచి డిసెంబర్ 4 మధ్య మూడు రైళ్లు రద్దు కానున్నాయని ప్రకటించారు. రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్, విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లు రద్దు చేయనున్నట్టు వెల్లడించారు. నవంబర్ 27, 28, 29, డిసెంబర్ 1, 2 తేదీల్లో విజయవాడ-విశాఖ రైలు, విశాఖ-విజయవాడ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రద్దు కానున్నాయని ప్రకటించారు. కాగా భద్రతా పనులు పూర్తయిన వెంటనే రైళ్లు యథావిథిగా నడవనున్నాయి.