AP High Court: వైజాగ్ కైలాసగిరి కొండ దిగువన తవ్వకాలపై హైకోర్టు స్టేటస్ కో

AP High court orders status quo in case related to kailasagiri
  • తెన్నేటి పార్కు కోసం నిబంధనలు ఉల్లంఘించి  కైలాసగిరి కొండను తవ్వుతున్నారని పిటిషన్
  • ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు చేపడుతోందన్న పిటిషనర్ తరపు న్యాయవాది
  • కౌంటర్ దాఖలు చేయాలని విశాఖ అధికారులకు కోర్టు సూచన
  • అప్పటివరకూ యథాతథ స్థితి కొనసాగుతుందని ఆదేశం 
  • తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా
తెన్నేటి పార్క్ కోసం విశాఖ కైలాసగిరి కొండ దిగువన జరుగుతున్న తవ్వకాలపై ఏపీ హైకోర్టు తాజాగా స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. బుధవారం న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. నిబంధనలకు విరుద్ధంగా కొండను తవ్వి పార్క్ నిర్మాణం చేపడుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు చేపడుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని విశాఖ మున్సిపల్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకూ యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
AP High Court
Kailasagiri case
Andhra Pradesh
Visakhapatnam

More Telugu News