Charan: 'గేమ్ చేంజర్' కోసం మైసూర్ కి చరణ్!

Game Changer movie update
  • షూటింగు దశలో 'గేమ్ చేంజర్'
  • రేపటి నుంచి తాజా షెడ్యూల్
  • మైసూరులో కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • హైలైట్ గా నిలవనున్న తమన్ సంగీతం

చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' సినిమా రూపొందుతోంది. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. ఇటీవలే హైదరాబాదులో ఒక షెడ్యుల్ ను పూర్తిచేశారు. తరువాత షెడ్యూల్ ను 'మైసూర్' లో ప్లాన్ చేశారు. రేపటి నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ అక్కడ మొదలుకానుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి చరణ్ మైసూర్ బయల్దేరాడు. ఎయిర్ పోర్టులో ఆయన కారు దిగి వెళుతున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. రేపటి నుంచి చరణ్ తో పాటు ప్రధానమైన పాత్రలను పోషించే ఆర్టిస్టుల కాంబినేషన్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News