Vijayasai Reddy: మరోసారి పురందేశ్వరిని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy targets Purandeswari again
  • ఎవరికి బెయిల్ వచ్చినా పురందేశ్వరి సంతోషిస్తారన్న విజయసాయి
  • కొందరి బెయిల్ మాత్రమే రద్దు చేయాలంటారని విమర్శ
  • వాటా ఇచ్చే బావకు బెయిల్ వచ్చిందనే ఆనందంలో ఉన్నారని మండిపాటు
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఎవరికి బెయిల్ వచ్చినా చిన్నమ్మ పురందేశ్వరి సంతోషిస్తారని... కానీ, కొందరి బెయిల్ మాత్రమే రద్దు చేయాలంటారని విమర్శించారు. ఇంత ఆత్మవంచన అవసరమా పురందేశ్వరి గారూ? అని ఆయన ప్రశ్నించారు. తాను దోచుకున్న దాంట్లో వాటా ఇచ్చే బావకు బెయిల్ వచ్చిందనే ఆనందంలో తేలిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఒకవేళ అలాంటిదేమీ లేదంటే... బెయిల్ రద్దు చేయమని కోరుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయాలని సవాల్ విసిరారు.
Vijayasai Reddy
YSRCP
Daggubati Purandeswari
BJP

More Telugu News