Ponguleti Srinivas Reddy: డిసెంబర్ 9న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు: పొంగులేటి

Congress CM is going to take oath on December 9 says Ponguleti Srinivas Reddy
  • రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేశారన్న పొంగులేటి
  • దొరను గడీలో బంధించాల్సిన సమయం ఆసన్నమయిందని వ్యాఖ్య
  • తనను, రేవంత్ ను ఓడించేందుకు డబ్బు సంచులు పంపిస్తున్నారని మండిపాటు
తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బంగారు తెలంగాణ కలలను కల్లలు చేశారని అన్నారు. దొరను గడీలోనే బంధించాల్సిన సమయం ఆసన్నమయిందని, కేసీఆర్ కు రాజకీయ సమాధి కట్టాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని హామీ ఇచ్చారు. పేదలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇస్తామని చెప్పారు. 

దోపిడీని ప్రశ్నిస్తున్న తనను, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడించేందుకు కేసీఆర్ డబ్బు సంచులను పంపిస్తున్నారని ఆరోపించారు. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని... డిసెంబర్ 9న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయబోతున్నారని జోస్యం చెప్పారు. నేలకొండపల్లి మండలం మజ్జుగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Ponguleti Srinivas Reddy
Revanth Reddy
Congress
KCR
BRS

More Telugu News