Jagan: జగన్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ

  • సీబీఐ దర్యాప్తు ఆలస్యంపై రఘురాజు పిటిషన్
  • సీబీఐ, జగన్, ప్రతివాదులకు నోటీసులు పంపిన సుప్రీంకోర్టు
  • పిటిషన్ పై శుక్రవారం విచారణ జరపనున్న సుప్రీం
Supreme Court to hear Jagan bail case on friday

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు ఆలస్యం అవుతోందంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణను త్వరగా పూర్తి చేసేలా సీబీఐని, సీబీఐ కోర్టును ఆదేశించాలని తన పిటిషన్ లో సుప్రీంకోర్టును కోరారు. జగన్ పదేళ్లుగా బెయిల్ పై బయట ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సీబీఐ, జగన్ తో పాటు ప్రతివాదులు అందరికీ నోటీసులు పంపింది. మరోవైపు రఘురామ పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు విచారణ జరపనుంది. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం పిటిషన్ ను విచారించనుంది.

More Telugu News