Revanth Reddy: కేసీఆర్‌కు పదేళ్లు అవకాశమిచ్చారు.. కాంగ్రెస్‌కు ఒక్కసారి ఇవ్వండి: రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

  • ఈ పదేళ్లలో కేసీఆర్ చేసిందేమీ లేదని రేవంత్ రెడ్డి విమర్శలు
  • బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ పరిస్థితిని ఊహించలేమని వ్యాఖ్య
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ
Revanth Reddy urges people to vote congress
Listen to the audio version of this article

కేసీఆర్‌కు పదేళ్లు అవకాశమిస్తే ప్రజలకు చేసిందేమీ లేదని, పైగా బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ పరిస్థితిని ఊహించలేమన్నారు. తెలంగాణ తీసుకువచ్చామని చెప్పిన వారికి పదేళ్లు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశమివ్వాలని కోరారు.

తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదా? తెలంగాణ ఇవ్వడం ద్వారా నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ సోనియా వెనక్కి తగ్గలేదన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్‌కు మరోసారి అవకాశం ఇచ్చే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.

More Telugu News