Kota Bommali: ఇది ఎవరినీ ఉద్దేశించి తీసిన సినిమా కాదు: అల్లు అరవింద్

  • మలయాళంలో హిట్ కొట్టిన 'నాయట్టు'
  • తెలుగు రీమేక్ గా 'కోట బొమ్మాళి పీఎస్'
  • ఈ నెల 24వ తేదీన సినిమా విడుదల
  • ఎలక్షన్స్ సమయంలో రిలీజ్ పట్ల స్పందించిన అల్లు అరవింద్

Kota Bommali PS Prachara Sabha

మలయాళంలో కొంతకాలం క్రితం వచ్చిన 'నాయట్టు' సినిమా, అక్కడ అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. చాలా తక్కువ పాత్రలతో .. ఇంట్రెస్టింగ్ గా సాగే కథ ఇది. అలాంటి ఆ సినిమాను గీతా ఆర్ట్స్ 2 వారు, 'కోటబొమ్మాళి పీఎస్' టైటిల్ తో రీమేక్ చేశారు. శ్రీకాంత్ .. వరలక్ష్మి శరత్ కుమార్ .. రాహుల్ విజయ్ .. శివాని ప్రధానమైన పాత్రలను పోషించారు. 

ఈ నెల 24వ తేదీన థియేటర్లకు ఈ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 'ప్రచారసభ'లో అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "సాధారణంగా దొంగలను పోలీసులు ఛేజ్ చేస్తుంటారు. కానీ ఈ సినిమాలో పోలీసులను పోలీసులే ఛేజ్ చేస్తుంటారు. ఈ కథలో హీరో .. హీరోయిన్స్ ఉండరు .. పాత్రలు మాత్రమే ఉంటాయి" అని అన్నారు. 

కరెక్టుగా చెప్పాలంటే కథనే హీరో అనుకోవాలి. ఈ కొత్తదనాన్ని తప్పకుండా అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇది పోలీసులకు .. రాజకీయనాయకులకు మధ్య జరుగుతుంది. ఎవరినీ ఉద్దేశించి ఈ సినిమాను తీయలేదు. పోలీసులను న్యాయం చేయనీయరు. ఆలిండియాలో ఉన్న ఈ వ్యవస్థను ఖండిస్తూ తీసిన సినిమా ఇది. ఎలక్షన్స్ సమయంలో ఈ సినిమా వస్తోంది .. ఆ సందర్భం కుదిరింది" అని చెప్పారు. 

More Telugu News