BRS: రేవంత్ రెడ్డిని ప్రచారానికి దూరం పెట్టండి: ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు

  • రేవంత్ రెడ్డి హింస చెలరేగేలా మాట్లాడుతున్నారన్న బీఆర్ఎస్ నాయకులు
  • ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చట్టాన్ని, ఈసీని బేఖాతరు చేస్తోందని ఆరోపణలు
  • సీఈవోకు నాలుగు ఫిర్యాదులు అందించినట్లు బీఆర్ఎస్ నేత సోమా భరత్ వెల్లడి
BRS IT cell complaint against Revanth Reddy to EC

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హింస చెలరేగేలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సోమవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సోమాభరత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం... సీఈవో వికాస్ రాజ్‌ను కలిసింది. కాంగ్రెస్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేశారు. అనంతరం సోమాభరత్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చట్టాన్ని, ఈసీని బేఖాతరు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.

సీఈవోకు నాలుగు ఫిర్యాదులు అందించినట్లు తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఈవో హామీ ఇచ్చారన్నారు. అనుమతులు లేకుండానే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సునీల్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తాము కోరినట్లు తెలిపారు. ఇష్టారీతిన మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని ప్రచారానికి దూరం పెట్టాలని తాము ఈసీని కోరినట్లు చెప్పారు.

More Telugu News