Vijay: నెట్ ఫ్లిక్స్ లోకి అడుగుపెడుతున్న 'లియో' .. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

  • విజయ్ హీరోగా తెరకెక్కిన 'లియో'
  • యాక్షన్ కి పెద్దపీట వేసిన లోకేశ్ కనగరాజ్ 
  • భారీతారాగణం ప్రధానమైన ఆకర్షణ 
  • ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 

Leo movie streaming date confirmed

విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'లియో' సినిమా రూపొందింది. లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. విజయ్ కి ఉన్న క్రేజ్ కారణంగా .. మార్కెట్ కారణంగా ఈ సినిమా బాగానే వసూలు చేసిందిగానీ, కంటెంట్ పరంగా ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేకపోయింది. 

అలాంటి ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ వారు ఈ నెల 24వ తేదీ నుంచి భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, కొంతసేపటి క్రితం ఒక పోస్టర్ ను వదిలారు. 28వ తేదీ నుంచి గ్లోబల్ లాంచ్ అంటూ మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

విజయ్ సరసన త్రిష నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్ .. అర్జున్ .. గౌతమ్ మీనన్ ... మన్సూర్ అలీఖాన్ .. ప్రియా ఆనంద్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. యాక్షన్ పాళ్లు ఎక్కువైపోయిన ఈ సినిమాకి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో చూడాలి మరి.

More Telugu News