Team India: 140 కోట్ల మంది మీ వెంటే ఉన్నారు... టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాహుల్ తదితరులు

  • ఇవాళ వరల్డ్ కప్ గ్రాండ్ ఫైనల్
  • అహ్మదాబాద్ లో టీమిండియా × ఆసీస్
  • టీమిండియాపై శుభాకాంక్షల వెల్లువ
  • కప్ గెలవాలంటూ ప్రముఖుల విషెస్
Wishes poured on Team India in world cup final

టీమిండియా ఇవాళ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియాపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ అధికారపక్షం బీఆర్ఎస్ పార్టీ తదితరులు టీమిండియాకు విషెస్ తెలిపారు. 


ప్రధాని నరేంద్ర మోదీ: ఆల్ ది బెస్ట్ టీమిండియా! మీరు కప్ గెలవాలని  140 కోట్ల మంది భారతీయులు మిమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు. మీరు ఈ మ్యాచ్ లో కాంతులీనాలని, బాగా ఆడి క్రీడాస్ఫూర్తిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.

అమిత్ షా: ఈ వరల్డ్ కప్ టోర్నీలో మన జట్టు విజయాలు, రికార్డులతో మోత మోగించింది. 140 కోట్ల మంది ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఇవాళ టీమిండియాకు మద్దతుగా నిలుస్తున్నారు. టీమిండియాకు నా బెస్ట్ విషెస్. బరిలో దిగి కప్ తీసుకురండి.

రాహుల్ గాంధీ: ఆస్ట్రేలియా జట్టుతో క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడుతున్న టీమిండియా కుర్రాళ్లకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. భయం లేకుండా మ్యాచ్ బరిలో దిగండి. మీకోసం వంద కోట్లకు పైగా హృదయాలు స్పందిస్తున్నాయి. మనం వరల్డ్ కప్ ను తీసుకువద్దాం. ఇండియా గెలవాలి.

అరవింద్ కేజ్రీవాల్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న టీమిండియాకు శుభాకాంక్షలు. మీ సత్తా ఏంటో చూపించండి. మీ అత్యుత్తమ ఆటతీరును బయటికి తీసుకురండి. మీ జైత్రయాత్రను కొనసాగిస్తూ చరిత్ర సృష్టించండి. యావత్ దేశం మీ వెంటే ఉంది.

కేసీ వేణుగోపాల్: ఇవాళ్టి మ్యాచ్ సందర్భంగా భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు. టీమిండియా... నువ్వు చాంపియన్ జట్టువి. నీ వెంటే మేమందరం కూడా.

బీఆర్ఎస్ పార్టీ: క్రికెట్ ప్రపంచ కప్ తుది పోరులో మన భారత జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ... ఆల్ ది బెస్ట్.

More Telugu News