Mathew Hayden: మహీంద్రా స్కార్పియో-ఎన్ కారును కొనుగోలు చేసిన ఆసీస్ క్రికెట్ దిగ్గజం

Mathew Hayden has brought Mahindra Scorpio N SUV
  • ఆస్ట్రేలియాలోనూ అమ్మకాలు సాగిస్తున్న మహీంద్రా సంస్థ 
  • ఆస్ట్రేలియాలో మహీంద్రా బ్రాండ్ అంబాసిడర్ గా మాథ్యూ హేడెన్
  • ఇప్పటికే హేడెన్ వద్ద పలు మహీంద్రా వాహనాలు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ దేశవిదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించుకుంటోంది. ఆస్ట్రేలియాలోనూ మహీంద్రా ఎస్ యూవీలు, హెవీ డ్యూటీ ట్రాక్టర్లకు మాంచి గిరాకీ ఉంది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్ మహీంద్రా సంస్థకు ఆస్ట్రేలియాలో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు హేడెన్ వద్ద పలు మహీంద్రా వాహనాలు ఉండగా, ఇటీవల మహీంద్రా స్కార్కియో-ఎన్ ఎస్ యూవీ వాహనాన్ని కూడా కొనుగోలు చేశాడు. బ్రిస్బేన్ లోని మహీంద్రా షోరూమ్ లో వాహనం డెలివరీ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను మహీంద్రా సంస్థ ఆస్ట్రేలియా విభాగం యూట్యూబ్ చానల్ లో పంచుకుంది.
Mathew Hayden
Mahindra Scorpio N
Brisbane
Australia

More Telugu News