Xi Jinping: 38 ఏళ్ల నాటి జిన్ పింగ్ ఫొటోను బయటకు తీసిన బైడెన్

  • ఇటీవల అమెరికాలో జిన్ పింగ్ పర్యటన
  • శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమైన బైడెన్-జిన్ పింగ్
  • తన ఫోన్ లో ఓ పాత ఫొటో చూపించిన బైడెన్
  • గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వద్ద తాను తీయించుకున్న ఫొటోను గుర్తుపట్టిన జిన్ పింగ్
Biden popped out a 38 years old photo of China president Xi Jinping

చైనా అధినేత షి జిన్ పింగ్ అమెరికాలో పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.  ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమావేశం సందర్భంగా జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిన్ పింగ్ ను బైడెన్ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 

సమావేశం సందర్భంగా తన ఫోన్ లో జిన్ పింగ్ కు ఓ ఫొటో చూపించారు. ఆ ఫొటో జిన్ పింగ్ దే. 38 ఏళ్ల నాటి తన ఫొటో చూసుకున్న చైనా అధ్యక్షుడి ముఖంలో చిరునవ్వు కనిపించింది. జిన్ పింగ్ యువకుడిగా ఉన్నప్పుడు అమెరికాలో పర్యటించగా, ప్రఖ్యాత గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వద్ద తీయించుకున్న ఫొటో అది. 

బైడెన్... జిన్ పింగ్ పాత ఫొటోను సేకరించిన విషయాన్ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్ యింగ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జిన్ పింగ్ కు బైడెన్ చూపిన ఫొటోను కూడా ఆమె పంచుకున్నారు. 

ఆ సమావేశంలో... "ఈ కుర్రాడు ఎవరో తెలుసా?" అని బైడెన్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను అడిగారని ఆమె వెల్లడించారు. దాంతో జిన్ పింగ్ హుషారుగా స్పందించారని, ఈ ఫొటో 38 ఏళ్ల నాటిదని కూడా గుర్తుచేసుకున్నారని చున్ యింగ్ వివరించారు.

More Telugu News